SV Krishna Reddy: కారుకు జరిమానా, పోలీసులపై డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

4 May, 2022 15:24 IST|Sakshi

కొద్ది రోజులుగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి  కార్లను తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింస్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా చాలా మంది సెలబ్రిటీల కార్లకి చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి కూడా జరిమానా విధించారు. మంగళవారం సుల్తాన్ బజార్ బ్యంక్‌ స్ట్రీట్‌ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి కారును  పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఆయన కారుకు ఇర్రెగ్యులర్‌ నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చలానా విధించారు.

చదవండి: హిందీ బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్‌ జోహార్‌

ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణా స్పందించిన తీరు అందరిని షాక్‌కు గురి చేస్తోంది. తప్పు తనదేనని, నెంబర్‌ ప్లేట్‌ సరి చేసుకుంటానని ఆయన పోలీసులు వివరణ ఇచ్చారు.  అనంతరం ఈ మండుటెండల్లో సైతం బాధ్యతగా విధులు నిర్వహిస్తోన్న ట్రాఫీక్‌ పోలీసులను డైరెక్టర్‌ అభినందించారు. కాగా టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన కామెడీ సినిమాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ జోనర్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్‌గా, నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా, రైటర్‌గా కూడా ఆయన మల్టీ టాలెంట్ చూపించారు. ఇక కొంతకాలంగా దర్శకత్వానికి బ్రేక్‌ ఇచ్చిన ఆయన ప్రస్తుతం బిగ్‌బాస్‌ సోహైల్‌ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు