HanuMan Movie : 'హనుమాన్‌'కి గ్రాఫిక్స్‌ చేసింది మన హైదరాబాద్‌లోనే..

3 Dec, 2022 16:47 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్‌. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.  వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజనాద్రి (Anjanadri) అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇటీవలె ఈ సినిమా టీజర్‌ విడుదలై జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విశేషంగా ఆకట్టుకుంది. దీనికి మరో ప్రధాన కారణం "వి.ఎఫ్.ఎక్స్". హాలీవుడ్ స్టాండర్డ్స్ ను తలదన్నేలా కనిపిస్తున్న ఈ గ్రాఫిక్స్ అద్దింది హైదరాబాద్ కు చెందిన "హేలో హ్యూస్ స్టూడియోస్" సంస్థ. దీంతో ఈ గ్రాఫిక్స్‌ కంపెనీ గురించి పలువురు టాలీవుడ్‌ దర్శకులు చర్చించుకుంటున్నారు. 
 

మరిన్ని వార్తలు