హైపర్‌ ఆది పెళ్లి ఆరోజే.. ఆమెనే పెళ్లాడతాడట!

22 Apr, 2021 13:44 IST|Sakshi

కామెడీ టీమ్‌కు స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేసిన హైపర్‌ ఆది రానురానూ అదే టీమ్‌కు లీడర్‌ అయ్యే స్థాయికి ఎదిగాడు. తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. తాజాగా అతడు పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాలని భావిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

నిజానికి హైపర్‌ ఆది.. ముందు సుధీర్‌, రష్మిల పెళ్లి అయిన తర్వాతే తాను పెళ్లిపీటలెక్కుతానని గతంలో పలుమార్లు మీడియాతో చెప్పాడు. కానీ వాళ్లు పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో తనే ముందు వివాహానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆది కోసం పెళ్లికూతురును వెతికే పనిలో పడ్డారట అతడి ఇంటి సభ్యులు. అతను కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చే అమ్మాయినే అర్ధాంగిగా చేసుకుంటానని చెప్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా పెళ్లి డేట్‌ కూడా ప్రకటించేశాడట హైపర్‌ ఆది. వచ్చే ఏడాది తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని అంటున్నాడట. అది కూడా తన సొంత జిల్లా ప్రకాశానికి చెందిన అమ్మాయితోనే ఏడడుగులు నడుస్తానని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో త్వరలోనే తెలియనుంది.

చదవండి: స్టార్‌ హీరో సినిమా: థియేటర్లో‌, ఓటీటీలో ఒకేసారి!

నటుడి కొడుకు కోసం చిరంజీవి ఖరీదైన గోల్డ్‌ చైన్‌‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు