చిరంజీవికి కరోనా రాలేదు

16 Nov, 2020 19:48 IST|Sakshi

కరోనా సోకలేదు  : చిరంజీవి

ఫాల్టీ కిట్‌ వల్ల  పాజిటివ్‌  ఫలితం వచ్చింది

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు నిజంగా పండగ లాంటే వార్త. తనకు కరోనా సోకలేదని చిరంజీవి స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.  ఫాల్టీ ఆర్టీ పీసీఆర్‌ కిట్‌ వల్ల తనకు పొరపాటున కోవిడ్‌-19 నిర్ధారణ అయిందని చెప్పారు.  కరోనా,  కాలం తనతో ఆడేసుకున్నాయంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.  (కరోనాతో సినీ రచయిత కన్నుమూత)

ఆచార్య సినిమా షూటింగ్‌కి వెళ్లడం కోసం కరోనా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలినట్లు చిరంజీవి ట్విటర్‌ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్షణాలు ఏమీ లేకపోయినా పాజిటివ్‌ వచ్చిందని ఆయన అప్పుడు పేర్కొన్నారు. అయితే, ఇది నిజం కాదని తాజాగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చిరు స్వయంగా తెలిపారు. ‘పాజిటివ్‌ అనేసరికి మందులు తీసుకోవడం ప్రారంభించాను. రెండు రోజుల తర్వాత నాకే అనుమానం వచ్చి, అపోలో ఆస్పత్రికి వెళ్లాను. సీటీ స్కాన్‌ చేసి అంతా బానే ఉందన్నారు.

ఆ తర్వాత ఇంకో ల్యాబ్‌లో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్‌ చేయించుకున్న తర్వాత కూడా నెగిటివ్‌ అనే చూపించింది. మొదట నేను ఎక్కడైతే టెస్ట్‌ చేయించుకున్నానో అక్కడ కూడా నెగెటివ్‌ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్టు వచ్చిన కిట్‌లో తప్పు ఉండి ఉంటుందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరు చూపిన ప్రేమాభిమానాలకు, పూజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని చిరంజీవి పేర్కొన్నారు.  దీంతో బిగ్‌ బాస్‌ సీజన్‌-4 యాంకర్‌ నాగార్జునతోపాటు,  ప్రముఖ యాంకర్‌ సుమ తదితరులంతా ఊపిరి పీల్చుకోవచ్చన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు