ఆ హీరోయిన్‌ని ప్రేమిస్తున్నా : వైష్ణవ్‌ తేజ్‌

11 Jun, 2021 15:13 IST|Sakshi

తొలి సినిమా ‘ఉప్పెన’తోనే  బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్‌. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్‌ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌. తొలి సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ యంగ్‌ హీరో తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తమ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ వైష్ణవ్‌ ముందు ఉంచారు నెటిజన్లు. వాటన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చాడు వైష్ణవ్‌.

ఈ క్రమంలో ‘సోనాక్షి సిన్హా అంటే మీకు ఎందుకు ఇష్టం’అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ఆమె అంటే ఇష్టం కాదు ప్రేమని చెప్పాడు. ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని వైష్ణవ్‌ అన్నాడు. ఇక అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. రజనీ కాంత్‌ అని, ఆయన నటించిన శివాజీ మూవీని చాలా సార్లు చూశానని చెప్పాడు.

సమంత గురించి ఏమైనా చెప్పండని ఓ నెటిజన్‌ అడగ్గా..  ఫ్యామిలీ మేన్‌-2లో సమంత నాకెంతో నచ్చేసిందన్నాడు. కృతిశెట్టిలో నటన కాకుండా దాగి ఉన్న మరో టాలెంట్‌ ఏంటని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్‌ అని చెప్పాడు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, ఆ తర్వాత గిరీశయ్య దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుందని తెలిపాడు. 


చదవండి:
బన్నీ అస్సలు తగ్గట్లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులతో దండయాత్రకు రెడీ
ఆ హీరోయిన్‌ను కాపీ కొడతాను: సమంత

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు