రూ. 900 డ్రెస్‌ను 50 రూపాయలకే కొన్నా: నిహారిక

17 Oct, 2021 10:39 IST|Sakshi

స్టార్‌ స్టయిల్‌

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్‌.. నిహారిక కొణిదెల. తెర పరిచయానికి ముందే ఫ్యాషన్‌ ఐకాన్‌గా గ్లామర్‌ ప్రపంచానికి ఆమె సుపరిచితం. ఆమె ఫ్యాషన్‌ సెన్స్‌ను ప్రతిబింబించే బ్రాండ్సే ఇవి.. 


కలశ ఫైన్‌ జ్యూయెల్స్‌.. 
కేవలం రూ. 40 పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు కోట్ల సామ్రాజ్యంగా మారింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో వీరిది 118 సంవత్సరాల అనుభవం. 1901లో శ్రీచంద్ర అంజయ్య పరమేశ్వర్‌ పొట్టకూటి కోసం హైదరాబాద్‌ వచ్చి, నెలకు రూ. 15 జీతంతో  ఓ బంగారు ఆభరణాల దుకాణంలో చేరాడు. తర్వాత నలభై రూపాయలు పోగుచేసి స్వయంగా వ్యాపారం ప్రారంభించాడు. అందమైన ఆభరణాల డిజైన్స్‌ అందిస్తూ వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించాడు. అప్పటి వరకు ‘చంద్ర అంజయ్య పరమేశ్వర్‌’ పేరుమీద ఉన్న దుకాణాన్ని ఈ మధ్యనే 2017లో ‘కలశ ఫైన్‌ జ్యూయెల్స్‌’గా మార్చారు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతరం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో బ్రాంచీలు ఉన్నాయి. 

ప్రత్యూష గరిమెళ్ల..
హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరుమీదే ఓ బొటిక్‌ ప్రారంభించింది. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్‌ వాల్యూ. జర్దోసీ, సీక్వెన్స్, గోటా పట్టి వంటి అల్లికలు ప్రత్యూష డిజైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్‌ను చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే. పలు ప్రముఖ ఆన్‌ లైన్‌ స్టోర్స్‌ అన్నిటిలోనూ ఈ డిజైన్స్‌ లభిస్తాయి. 

బేరం బాగా ఆడతా.. 
ఒకసారి టెన్త్‌క్లాస్‌లో ఢిల్లీ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఖాన్‌బజార్‌లో రూ. 900 డ్రస్‌ను రూ. 50కే కొన్నా. అది కూడా గంటసేపు బేరం ఆడి. ఇప్పుడు బేరం ఆడటం కొంచెం తగ్గించా. 
– నిహారిక కొణిదెల

డ్రెస్‌ డిజైనర్‌: 
ప్రత్యూష గరిమెళ్ల 
ధర:రూ. 44,800

 జ్యూయెలరీ
 కలశ ఫైన్‌ జ్యూయెల్స్‌
ధర:ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు