Tamanna Bhatia: నా దృష్టిలో లక్‌ అంటే అదే : తమన్నా

10 Jul, 2022 08:23 IST|Sakshi

సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేస్తుంటారు. తాజాగా ‘ఆస్క్‌ తమన్నా’ అంటూ తమన్నా ఫ్యాన్స్‌కు ఆఫర్‌ ఇచ్చారు. అంతే.. నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. తమన్నా కూల్‌గా జవాబులు చెప్పారు. వాటిలో కొన్ని ఈ విధంగా... 

జీవితంలో మీరు నేర్చుకున్న ఏ అంశాన్ని ఇతరులతో షేర్‌ చేసుకోవాలనుకుటున్నారు? 
నీలో ఉన్న ధైర్యాన్ని నమ్ముతూ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. 

మిమ్మల్ని బాగా భయపెట్టే విషయం? 
అప్పడప్పుడు నా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను. ఇది నన్ను చాలా భయపెట్టే అంశం. 

మీరు చేసినవాటిలో స్పెషల్‌ రోల్స్‌గా భావించేవి? 
‘ధర్మదురై’ చిత్రంలో సుభాషిణి, ‘బాహుబలి’లో అవంతిక. 

మీ కెరీర్‌లో చాలెంజింగ్‌ రోల్‌? 
‘ఎఫ్‌ 3’లో నేను చేసిన అబ్బాయి పాత్ర. 

ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఎప్పుడు చేస్తారు? 
నాకు చేయాలనే ఉంది. నాకు ఉన్న డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌లో ఇదొకటి. 

ఏ కల్పిత పాత్రలను మీరు మీ జీవితంలో నిజంగా కలవాలనుకుంటున్నారు? 
షెర్లాక్‌ హోమ్స్‌ పాత్రలు 

సక్సెస్‌ కావడానికి ఏం ఫాలో అవ్వాలంటారు? 
మీ ప్యాషన్‌ను ఫాలో అవ్వండి. మీ గోల్‌ను సాధించడానికి  తీవ్రంగా శ్రమించండి. ఈ ప్రయత్నంలో విఫలమైనా మళ్లీ ప్రయత్నించండి. 

అదృష్టం అంటే మీ దృష్టిలో..? 
మన కష్టానికి విధి సహాయ పడడాన్ని నేను లక్‌గా భావిస్తాను.
 
హాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా? 
అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. 

మీ ఫేవరెట్‌ జానర్‌ మూవీస్‌? 
యాక్షన్‌ అండ్‌ రొమాన్స్‌. 

కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొనడం గురించి?  
కాన్స్‌ చిత్రోత్సవాల్లో భాగస్వామ్యంగా ఉన్న మన దేశం తరఫున ఓ నటిగా నేను ప్రాతినిథ్యం వహించడం చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాజికల్‌గా ఉంది. చాలా గౌరవంగా ఫీలవుతున్నాను. 

మీ తర్వాతి చిత్రాలు? 
చిరంజీవిగారితో ‘బోళా శంకర్‌’ సినిమా చేస్తున్నాను. ‘బబ్లీ బౌన్సర్‌’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. త్వరలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించబోతున్నాను.

మరిన్ని వార్తలు