'ఆంటీలా కనిపిస్తున్నావంటూ ట్రోల్స్‌.. బాడీ షేమింగ్‌ చేసేవాళ్లు'

18 Jul, 2021 11:44 IST|Sakshi

ప్రెగ్నెన్సీ జర్నీని వివరించిన నటి సమీరా రెడ్డి

ప్రెగ్నెన్సీ టైంలో హర్మోన్స్‌ ఇంబ్యాలెన్స్‌తో మహిళల్లో అనేక శరీర మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ఆందోళన చెందడం, బరువు పెరగడం చాలామంది మహిళల్లో  సహజంగా జరిగేవే. కానీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి వాళ్లకు సంబంధించిన ప్రతీ అంశం సెన్సేషన్‌ అయిపోతుంది. వాళ్లు  బరువు పెరిగినా, తగ్గినా ప్రేక్షకుల నుంచి సరిగ్గా రిసీవింగ్‌ ఉండదు. మరీ ఆంటీలా కనిపిస్తున్నావంటూ చెడామడా ట్రోల్స్‌ చేసేస్తుంటారు. నటి సమీరా రెడ్డి సైతం ఇలాంటి అబ్యూసివ్‌ మెసేజెస్‌, ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. తాజాగా తాను గర్భవతిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న శరీరమార్పులు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై నటి సమీరా రెడ్డి స్పందించారు. 

A post shared by Sameera Reddy (@reddysameera)

'బిడ్డకు జన్మనివ్వడం అన్నది చాలా గొప్పవిషయం. ఆ మధుర క్షణాలన్నింటిని ఆస్వాదించండి. శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం సహజమే. బరువు పెరగడంతో ఒత్తిడికి లోనవుతుంటారు చాలామంది. నా విషయంలోనూ ఇలాంటివి జరిగాయి. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్‌ అవడంతో భయపడ్డాను. హన్ష్‌ పుట్టిన తర్వాత నేను దాదాపు 105కేజీల బరువు పెరిగాను. సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా ట్రోల్‌ చేసేవాళ్లు. బాడీ షేమింగ్‌ చేసేవాళ్లు. దీంతో తెలీకుండానే ఒకింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. కానీ నేను ఇలా ఎందుకు బాధపడుతున్నానా అనిపించింది. మెల్లిమెల్లిగా దాన్నుంచి బయటపడ్డాను.

A post shared by Sameera Reddy (@reddysameera)

ఇక రెండోసారి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. హన్ష్‌ డెలీవరీ టైంలో మిస్‌ చేసుకున్న చిన్నిచిన్ని ఆనందాలను కూడా సెలబ్రేట్‌ చేసుకున్నాను. నైరా పుట్టడానికి ఒకరోజు ముందు ఆ షూట్‌ చేశాం. అలా బిగ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌గా ఉండటం ఎంత సంతోషాన్ని ఇచ్చిందో చెప్పలేదు. ఇక నైరా పొట్టలో ఉన్నప్పుడు 8వ నెలలో బేబీ బంప్‌తో అండర్‌ వాటర్‌ షూట్‌ చేశాం. అది చూసి చాలా మంది ఆడవాళ్లు..మీరు చాలా ఇన్‌స్పైర్‌ చేస్తున్నారు.. మీలాగే ఉండాలనుకుంటున్నా' అంటూ నాకు మెసేజ్‌ చేసేవాళ్లు అని తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి వివరించింది. 

A post shared by Sameera Reddy (@reddysameera)


 

మరిన్ని వార్తలు