35 సార్లు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నా : హీరోయిన్

31 Mar, 2021 08:57 IST|Sakshi

లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు మొదలుపెట్టినప్పుడు అందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని చిత్రీకరణలో పాల్గొనడం మొదలుపెట్టారు. అలా కరోనా టెస్ట్‌ చేయించుకున్నవారిలో నిధీ అగర్వాల్‌ ఉన్నారు. ఈ విషయం గురించి నిధీ మాట్లాడుతూ –‘‘ఫస్ట్‌ టైమ్‌ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపించింది.

కానీ తర్వాత అలవాటు పడ్డాను. గత అక్టోబరు నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న సినిమాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల మధ్య తిరుగుతూ బిజీగా ఉంటున్నాను. జర్నీ చేసిన ప్రతిసారీ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికి దాదాపు 35సార్లు టెస్ట్‌ చేయించుకున్నాను’’ అన్నారు.
చదవండి:
‘రామ్‌ సేతు’లో అక్షయ్‌ కుమార్‌ ఫస్ట్‌లుక్‌ చూశారా?‌
‘వకీల్‌ సాబ్‌’కు అనుమతి నిరాకరణ 

మరిన్ని వార్తలు