మళ్లీ తల్లి కాబోతున్న ప్రముఖ హీరోయిన్‌

12 Aug, 2020 16:43 IST|Sakshi

కరీనా కపూర్‌ ఖాన్‌ రెండోసారి తల్లి కాబోతున్నారనే వార్తలపై ఆమె తండ్రి రణదీర్‌ కపూర్‌ స్పందించారు. కరీనా ప్రెగ్నెంట్‌ అని సమాచారం లేదని, అయితే ఆ వార్తలు నిజమైతే బాగుంటుందని అన్నారు. తైమూర్‌ ఖాన్‌కి తోబుట్టువు వస్తే సంతోషిస్తానని తెలిపారు. కాగా, సైఫ్‌ అలీఖాన్‌, కరీనా దంపతులకు తొలి సంతానం మూడేళ్ల చిన్నారి తైమూర్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, రణదీర్‌ కపూర్‌ స్పందించిన కొద్దిసేపటికే సైఫ్‌ అలీఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తమ కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారని తెలిపారు. అభిమానులకు, వెల్‌ విషర్స్‌కి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
(చదవండి: లాల్‌సింగ్‌ వాయిదా పడ్డాడు)

ఇదిలాఉండగా.. కరీనా అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తోంది. అమీర్ ఖాన్‌తో కథానాయకుడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్‌కి రీమేక్. ఈ ఏడాది డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం మొదట ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన బ్రేక్‌ కారణంగా సినిమా షూటింగ్‌ జరగలేదు. అందువల్ల ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తున్నట్లు సోమవారం చిత్రబృందం పేర్కొంది.
(ఆకట్టుకుంటున్న సడక్‌ 2 ట్రైలర్‌)

"We are very pleased to announce  that we are expecting an addition to our family !! Thank you to all our well-wishers for all their love and support." - Saif ali khan

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా