‘నాటు నాటు’ ఆస్కార్‌కి నామినేట్ అవ్వడం గర్వంగా ఉంది: రాహుల్‌ సిప్లిగంజ్‌

28 Jan, 2023 18:34 IST|Sakshi

తాను ఆలపించిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కి నామినేట్‌ అవ్వడం ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట అస్కార్‌కి నామినేట్‌ అయిన సందర్భం రాహుల్‌ సిప్లిగంజ్‌ను షేడ్ స్టూడియోస్ సీఈవో దేవీప్రసాద్ బలివాడ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని గౌరవాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని పాట ఆస్కార్‌ బరిలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ‘మా స్టూడియోస్‌తో ఎంతో అనుబంధం ఉన్న  కీరవాణి, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ మరియు లిరిక్‌ రైటర్‌ చద్రబోస్‌  ఈ పాటకి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ టీమ్‌తో కలిసి ఎన్నోసార్లు మ్యూజికల్ జర్నీ లో మా షేడ్ స్టూడియోస్ భాగమైనందుకు మేము అదృష్టం గా భావిస్తున్నాం’నఅ‍్నారు. 

ఇక రాహుల్‌ సిప్లిగంజ్‌ మాట్లాడుతూ.. ‘నా పాట ఆస్కార్‌కి నామినేట్‌ అయిందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. ఈ సంతోషానికి మూల కారణమైన దర్శకధీరుడు రాజమౌళి గారు, ఎమ్.ఎమ్. కీరవాణి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాటు నాటు సాంగ్ తప్పకుండ ఆస్కార్ లో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలు నాకు ఎంతో సంతోషంగా ఉంది.

మరిన్ని వార్తలు