Sonu sood: నా తుదిశ్వాస వరకు... సోనూ ట్వీట్‌ వైరల్‌

31 Jul, 2021 17:12 IST|Sakshi

 సోనూ సూద్‌  బర్త్‌డే, అభిమాను కోలాహం

 నా తుదిశ్వాస వరకు  శక్తిమేరకు సాయం చేస్తూనే ఉంటా  : సోనూ

సాక్షి, ముంబై: నటుడు, కరోనా కాలంలో రియల్‌ హీరోగా అవతరించిన సోనూ సూద్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంటిముందు అభిమానుల సందడి నెలకొంది.  సోనూకు బర్త్‌డే విషెస్‌ అందించేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారు.   చిన్నా పెద్దా అంతా  సోనూ నివాసం ముందు క్యూ కట్టారు. బాణా సంచా, పాటలు, కేకులతో హంగామా చేశారు. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన అభిమానులతో సోనూ సందడిగా గడిపారు.  దీనికి సంబంధించిన వీడియోను సోనూ శనివారం ట్విటర్‌లో  షేర్‌ చేశారు.

కాగా పుట్టిన రోజు సందర్బంగా కేవలం సాయం పొందినవారు, బాధితులు మాత్రమే కాదు, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ముఖ‍్యమంత్రులు, రాజకీయ నేతలు, ఇంకా పలువురి ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ కురిసింది. దీంతో హ్యాపీ బర్త్ డే సోనూ సూద్ హ్యాష్‌ట్యాగ్‌, ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే తనకు విషెస్‌ చెప్పిన అందరికీ పేరు పేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌ విశేషంగా నిలిచింది. 
 
‘నా తుది శ్వాస వరకు నా శక్తిమేరకు పేదవారికి సేవ చేస్తానని పుట్టినరోజు సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ’ ట్వీట్‌ చేశారు. దీంతో సోనూ ఔదార్యానికి, పెద్ద మనసుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.  హృదయపూర్వంగా  ధన్యవాదాలు  తెలిపారు. 

కాగా కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సాయపడటం మొదలు, ఇటీవలి కరోనా సెకండ్‌ వేవ్‌ సంక్షోభంలో బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందించడమే కాదు, ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందుకే బాధితులంతా తమ గుండెల్లో గుడి కట్టుకుని మరీ సోనూని ఆరాధిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు