విజయదేవరకొండతో నటించాలని ఉంది

11 Feb, 2023 07:45 IST|Sakshi

వర్ధమాన నటి ప్రగ్యా నయన్‌ 

సీతమ్మధార (విశాఖ ఉత్తర): ‘విశాఖ అంటే చాలా ఇష్టం..ఇక్కడ అందాలకు ఫిదా అయ్యా’ అని వర్ధమాన నటి ప్రగ్యా నయన్‌ పేర్కొన్నారు. దిల్‌వాలే సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆమె విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా నయన్‌తో ‘సాక్షి’తో చిట్‌చాట్‌.  

సినిమా రంగానికి ఎలా వచ్చారు? 
 మోడలింగ్‌లో రాణించడంతో నాపై నమ్మకం కలిగింది. క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిని సది్వనియోగం చేసుకుంటున్నా. 

 ఇంతవరకు ఎన్ని చిత్రాల్లో నటించారు? 
మూడు చిత్రాల్లో నటించా. సురాపానం నా తొలిచిత్రం..మంచి పేరు వచ్చింది. చక్రవ్యూహం మార్చిలో విడుదల కానుంది. మూడో చిత్రం దిల్‌వాలే. మరో సినిమా కూడా ఈనెల 26న ప్రారంభం కానుంది. 

మీకిష్టమైన హీరో  
బన్నీ అంటే ఇష్టం. టాలీవుడ్‌లో అందరు హీరోలతో పనిచేయాలని ఉంది. ముఖ్యంగా విజయదేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్లతో నటించాలని ఉంది. 

మీ గురించి చెప్పండి 
బెంగళూరులో చదువుకున్నా..అక్కడే విప్రోలో ఉద్యోగం చేస్తూనే మోడలింగ్‌ చేశా..అలా సినిమా అవకాశాలు రావడంతో ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టా. 

 వైజాగ్‌ ఎలా ఉంది  
వావ్‌ అద్భుతంగా ఉంది. ఇక్కడ బీచ్, పర్యాటక ప్రాంతాలు నా మనస్సు దోచుకున్నాయి. ఐ లవ్‌ వైజాగ్‌.  

మరిన్ని వార్తలు