Kriti Sanon: ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా!

21 Aug, 2021 03:30 IST|Sakshi

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్, ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని అంటున్నారు హీరోయిన్‌ కృతీ సనన్‌. ‘‘ప్రభాస్‌.. టైగర్‌ ష్రాఫ్‌.. కార్తీక్‌ ఆర్యన్‌’ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్‌ చేస్తారు?’ అనే ప్రశ్నలకు కృతీ సనన్‌ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని, టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతానని, కార్తీక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌ చేస్తానని కృతీ సనన్‌ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’ సినిమాలో ప్రభాస్, కృతీ సనన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. (ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్లాలనుంది : బిగ్‌బాస్‌ బ్యూటీ)

కడపలో ‘రాధేశ్యామ్‌’
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కడపలో జరుగుతోంది. టైటిల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను తీస్తున్నారని తెలిసింది. ఈ సీన్స్‌లో నటుడు సత్యరాజ్‌ పాల్గొంటున్నట్లు తెలిసింది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీ విషయంపై త్వరలో స్పష్టత రానుంది. 

మరిన్ని వార్తలు