‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రిలీజ్‌కు రెడీ

14 Aug, 2021 09:45 IST|Sakshi

సుశాంత్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహించారు. ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్‌ బ్యానర్స్‌పై రవి శంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు దర్శన్‌ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ అయ్యాయి. అదే విధంగా సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి సినిమాలను సక్సెస్‌ చేస్తున్నారు. మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్‌.

మరిన్ని వార్తలు