చిన్నప్పటి ఫోటో: స్టార్‌ కమెడియన్‌ను గుర్తుపట్టారా!

29 Jan, 2021 20:10 IST|Sakshi

మనకు బాగా తెలిసిన సెలబ్రిటీలను తమ చిన్నప్పటి ఫోటోలు చూస్తే సులభంగా గుర్తుపట్టేస్తాం.. కానీ కొంత మందిని మాత్రం ఎంత చూసిన వారు వీరేనని గుర్తించడం చాలా కష్టం.. పేరు చెబితే కానీ వాళ్లేవరో అస్సలు మనసుకు తట్టదు. తాజాగా ఓ స్టార్‌ కమెడియన్‌ బ్యాలం నాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు ఉన్న ఈ చిత్రంలో తలపై క్యాప్‌ ధరించి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న వ్యక్తి హిందీ బుల్లితెరపై పాపులర్‌ హాస్యనటుడు. పక్కన ఉన్నది తన సోదరుడు. ఇది సరిగ్గా 28 ఏళ్ల క్రితం దిగిన ఫోటో. దీన్ని చూస్తుంటే అతనెవరో గుర్తు పట్టడం కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. చదవండి: బ్రేక్‌ తీసుకుంటున్నా: స్టార్‌ కమెడియన్‌

అయినప్పటికీ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఏంటీ సాధ్యపడటం లేదా. సరే ఇక మేమే సమాధానం చెప్తాం. అతనెవరో కాదు.. బాలీవుడ్‌ టాప్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ. అవును కపిల్‌, తన సోదరుడితో కలిసి 28 ఏళ్ల క్రితం దిగిన ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ ఫోటో తీసినప్పుడు కపిల్‌కు 11 ఏళ్లు కాగా ఇప్పుడు 39 సంవత్సరాలు. అంతేగాక గతేడాది నవంబర్‌లో కపిల్‌ ఇంటర్‌ చదువుతున్నప్పటి ఓ ఫోటోను ఆయన ఫ్యాన్స్‌ పేజీలో షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా విజయవంతంగా కొనసాగుతున్న కామెడీ షో ‘ది కపిల్‌ శర్మ షో’  కొన్నాళ్లపాటు వాయిదా పడనున్న విషయం తెలిసిందే. కపిల్‌ శర్మ భార్య  గిన్నీ చరాత్‌ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కావడంతో కొన్ని రోజులు కుటుంబంతో కలిసి గడిపేందుకు షోకు బ్రేక్‌ చెప్పాడు. 

A post shared by Kapil Sharma (@kapilsharma)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు