ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో ‘ఎన్‌ఎంబీకే’ సందడి

21 Aug, 2022 11:12 IST|Sakshi

వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇటీవల ‘సమ్మతమే’తో ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్‌ హీరో.. త్వరలోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు.  ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ ఫేమ్‌ శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’(NMBK). సంజనా ఆనంద్, సిద్ధార్థ్‌ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇదివరకే రిలీజైన టీజర్ కు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్ గా  ఈ యంగ్ హీరో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ  కళాశాలను సందర్శించారు. అక్కడ కిరణ్‌తో పాటు చిత్ర యూనిట్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం మాస్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంతో పాటు గీతా ఆర్ట్స్‌, మైత్రి మూవీ మేకర్స్‌ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలోనూ కిరణ్‌ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు