ఇఫీకి అంతా సిద్ధం

23 Oct, 2022 01:34 IST|Sakshi

ఈ ఏడాది జరగనున్న ‘ది ఇంటర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఇఫీ)కి రంగం సిద్ధం అయింది.  53వ ఇఫీ వేడుకలు గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. పన్నెండుమంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 25 సినిమాలను, ఆరుగురు సభ్యుల జ్యూరీ నాన్‌ – ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేసింది. ఇండియన్‌ పనోరమ సెక్షన్‌ కింద ఈ 45 చిత్రాలు ప్రదర్శించబడతాయి.

ఇందులో పది హిందీ చిత్రాలు, ఐదు మరాఠీ చిత్రాలు, నాలుగేసి చొప్పన తెలుగు, తమిళ  సినిమాలు, ఇంకా ఇతర భాషల చిత్రాలు ఉన్నాయి. ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం..రణం..రుధిరం), బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, హిందీ నుంచి అడివి శేష్‌ ‘మేజర్‌’,  అనుపమ్‌ ఖేర్‌ – పల్లవీ జోషి భాగమైన ‘ది కశ్మీరీ ఫైల్స్‌’, ఆర్‌ఏ వెంకట్‌ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’ వంటివి ఉన్నాయి.

నాన్‌–ఫీచర్‌ విభాగంలో ‘టాంగ్‌’, ‘రే– ఆర్ట్‌ ఆఫ్‌ సత్యజిత్‌ రే’, ‘క్లింటన్‌ అండ్‌ ఫాతిమా’ వంటి సినిమాలు ఉన్నాయి. కాగా మెయిన్‌స్ట్రీమ్‌ సెక్షన్‌లో  ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ (హిందీ), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (తెలుగు), ‘అఖండ’ (తెలుగు), ‘టానిక్‌’ (బెంగాలీ), ‘ధర్మవీర్‌: ముక్కమ్‌ పోస్ట్‌’ (మరాఠీ) చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండియన్‌ పనోరమ సెక్షన్‌లో తెలుగు చిత్రాలు ‘సినిమా బండి’ (దర్శకుడు కంద్రేగుల ప్రవీణ్‌), ‘ఖుదీరామ్‌ బోస్‌’ (దర్శకుడు విద్యాసాగర్‌ రాజు) ఉన్నాయి. 

మరిన్ని వార్తలు