IFFI: కిడకి అభినందనలు

24 Nov, 2022 04:41 IST|Sakshi
అవార్డు అందుకుంటున్న రవికిశోర్, వెంకట్‌

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. పూ రామన్, కాళీ వెంకట్‌ ప్రధాన పాత్రల్లో ఆర్‌ఏ వెంకట్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (‘భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’)లో ఇండియన్‌ పనోరమా విభాగంలో ప్రదర్శించగా, వీక్షకులు ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’తో అభినందించారు.

‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘ఏఆర్‌ వెంకట్‌కి ‘కిడ’ తొలి సినిమా అయినా బాగా తీశాడు. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే చూస్తారనే నమ్మకంతో తమిళంలో తీశాను’’ అన్నారు. ఆర్‌ఏ వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘తాత, మనవడు, మేక చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. పనోరమాలో పదర్శించిన సినిమాని చాలామంది స్టూడెంట్స్‌ చూశారు.. వారికి బాగా నచ్చింది. నా తొలి సినిమాకు రవికిశోర్‌లాంటి నిర్మాత లభించడం నా అదృష్టం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు