Ileana Bikini Photo: బాబోయ్‌ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్‌ చేసిందేంటి!

5 Feb, 2022 14:55 IST|Sakshi

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ఇలియాన ఓ షాకింగ్‌ ఫొటో షేర్‌ చేసింది. తన బికిని ఫొటోను చూసి అంతా ఒక్కసారిగా కంగుతింటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఒకప్పుడు సన్నని నాజుకు నడుముతో కుర్రకారు మతిపోగోట్టిన ఈ ‘రాక్షసి’ ఈ ఫొటో బోద్దుగా కనిపించడంతో ఫ్యాన్స్‌ అంతా షాకవుతున్నారు. దీంతో ఇదేంటి ఏమాత్రం ఎడిట్‌ చేయని ఫొటో షేర్‌ చేసి ఇలియాన ఇలాంటి సాహసం చేసిందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత ఈ ఫొటోతో తను ఇచ్చిన సందేశం చూసి ఇలియానపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రెడ్‌ హాట్‌ బికిని ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ ఇలియాన ఏం చెప్పిందంటే.. ‘మీరు సన్నగా మరింత టోన్డ్.. ఇంకా అందంగా కనిపించేందుకు.. మీ శరీరాన్ని చాలా అప్రయత్నంగా మార్చుకునే యాప్స్ లలోకి వెళ్లడం చాలా సులభం. నేను ఆ యాప్స్ అన్నింటిని డెలిట్ చేశాను. అందుకు నేను గర్వపడుతున్నాను. ఇది నేను, నా ప్రతి అంగుళం, ఇదే నా శరీరాకృతి. ఇప్పుడు నేను అందరినీ హగ్ చేసుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో పాటు ‘నువ్వు అందంగా ఉన్నావు’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది. ఇది చూసి తన ధైర్యం, ఆటిట్యూడ్‌కు ఆమె ఫాలోవర్స ఫిదా అవుతున్నారు.

‘మంచి సందేశం ఇచ్చావు, ఇది నిజం, బ్రేవ్‌ లేడీ’ అంటూ కొందరు ఇలియానకు మద్దుతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానవెండితెరపై అంతగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోష్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‏లో టచ్‏లో ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో ఇలియానా బాడీ డైస్మార్పికి డిజార్డర్‌తో బాధపడ్డానని, తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. సమస్యలను అధిగమించడానికి తనకు మానసిక చికిత్స ఉపయోగపడిందని చెప్పింది. 

మరిన్ని వార్తలు