Ileana: హీరోయిన్ బ్రదర్‌తో ఇలియానా డేటింగ్‌ !.. ఫొటోలు వైరల్‌

17 Jul, 2022 17:51 IST|Sakshi

Ileana Dating With Katrina Kaif Brother Sebastian: ఇలియానా.. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా చెలామణి అయింది ఈ గోవా బ్యూటీ. 'దేవదాస్‌' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ యూత్‌ను 'పోకిరీ'లుగా మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోయిన్‌ బ్రదర్‌తో ఈ గోవా బ్యూటీ డేటింగ్‌లో ఉన్నట్లు ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

బాలీవుడ్‌ భామ కత్రీనా కైఫ్‌ సోదరుడుల సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో ఇలియానా లవ్‌ ట్రాక్‌ నడిపిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్‌ సెబాస్టియన్‌, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 

చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
వెబ్‌ వీక్షకులు ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ?

A post shared by Ileana D'Cruz (@ileana_official)


నెట్టింట తెగ వైరల్‌ అయిన ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్‌ 'ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొంది?' అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా, సెబాస్టియన్‌ 6 నెలలుగా డేటింగ్‌ చేస్తున్నట్లు పలు వెబ్‌సైట్‌లలో వార్తలు వచ్చాయి. మరోవైపు సెబాస్టియన్‌ ఇన్‌స్టా అకౌంట్‌ను గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. కాగా ఈ గోవా సుందరి గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం జరిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల డేటింగ్‌ తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. అయితే ఆండ్రూ, ఇలియానా పెళ్లి చేసుకునే విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. 

చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు