ఇతడే నా బాయ్‌ఫ్రెండ్‌.. ఫోటో షేర్‌ చేసిన ఇలియానా

3 Mar, 2021 12:40 IST|Sakshi

'దేవ‌దాసు' చిత్రంతో వెండితెర‌పై హీరోయిన్‌గా అడుగు పెట్టిన ఇలియానా..ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చారు. అక్కడ ఆడపదడపా సినిమాల్లో నటించిన గోవా బ్యూటీ. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ప్రస్తుతం  'అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్లీ' అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ‌'ఆస్క్‌మీఎనీథింగ్‌' సెషన్‌ను నిర్వహించిన ఇలియానాకు..మీ బాయ్‌ఫ్రెండ్‌ పేరంటని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు.

తన పేరు  చార్లి అంటూ ఓ ఫోటోను షేర్‌ చేసి నెటిజన్‌కు షాకిచ్చింది ఈ సన్నజాజి భామ. చార్లి అంటే ఇలియానా ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కుక్క పేరు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్ర్యూ నీబోన్‌తో ఇలియానా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చిన ఇలియానా..ఈ మధ్య కెరియర్‌పై ఫోకస్‌ పెట్టి వరుస సినిమాల్లో నటిస్తుంది. 

మీ చర్మ సౌందర్యం కోసం ఏదైనా శస్త్రచికిత్స తీసుకున్నారా అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా...ఇప్పటివరకు అయితే లేదని, మన శరీరం ఎలా ఉన్నా యాక్సెప్ట్‌ చేయాలని బదులిచ్చింది. ‘గతంలో నా శరీరాకృతి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేదాన్ని. ఎలా కనిపిస్తున్నాం? బాగానే కనబడుతున్నామా? అని తెగ ఆలోచించేదాన్ని.ఆ ఒత్తిడి ఎలా ఉండేదో చెప్పలేను. నా ముక్కు షార్ప్‌గా లేదని, పెదాలు ఇంకా పెద్దగా లేవని, చేతులు సరిగ్గా లేవని, పొట్ట కొంచెం ముందుకు ఉంటుందని, నడుము పెద్దగా ఉంటుందని, ఇంకా ఎత్తు ఉండాల్సిందేమోనని, చురుకుగా లేనేమోనని, ఫన్నీగా ఉండనేమోనని,  ఫర్ఫెక్ట్‌గా లేనేమో అని... ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోలనుకోవడం లేదని, నాకున్న లోపాలతో సంతృప్తిగానే ఉన్నాను’’ అని పేర్కొంది ఇలియానా. 

 

చదవండి :(‘నా శరీరం అందంగా లేదని అనుకునేదాన్ని’)
(18 ఏళ్లకే ఫస్ట్‌ కిస్‌.. డేటింగ్‌ మాత్రం..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు