కొత్త బిజినెస్‌ మొదలు పెట్టనున్న ఇలియానా!

18 May, 2021 01:26 IST|Sakshi

నటీనటులు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు.. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. గోవా బ్యూటీ ఇలియానా కూడా త్వరలో కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్న ఇలియానా కొత్త బిజినెస్‌ మొదలుపెట్టేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారట. అందులో భాగంగానే బేకరీ, రెస్టారెంట్లు వంటి చైన్‌ బిజినెస్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

హీరోయిన్‌గా తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని తన పేరుతోనే వీటిని మార్కెట్‌ చేసుకోవాలనుకుంటున్నారని టాక్‌. అయితే ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం అంటే రిస్క్‌ చేసినట్టే అనే కొందరు అన్నారట. ఇలియానా కూడా ఈ ఆలోచనతోనే లాక్‌డౌన్‌ తర్వాతే వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. సో.. భవిష్యత్తులో ఇలియానా బేకరీ, ఇలియానా రెస్టారెంట్‌కి శ్రీకారం జరుగుతుందన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు