ఇండియన్‌ మోస్ట్‌ పాపులర్‌ మూవీగా విజయ్‌ ‘మాస్టర్‌’

14 Jun, 2021 08:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన చిత్రం ‘మాస్టర్‌’. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో విడుదలై ఈ సినిమా తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.

2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్‌ విడుదల చేసింది. అందులో మాస్టర్‌ చిత్రం నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తమన్నా నవంబర్‌ స్టోరీ- 5, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్‌ 9వ స్థానం దక్కించుకుంది.

మరిన్ని వార్తలు