సల్మాన్‌ నోట దేశభక్తి పాట.. వైరల్‌

15 Aug, 2020 12:25 IST|Sakshi

భారత దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ కళకారులు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా ఓ దేశ భక్తి పాట పాడి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రముఖ నిర్మాత  అతుల్ అగ్నిహోత్రి ఈ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌ అయింది. ఈ వీడియోలో సల్మాన్‌ ‘సారే జహాసే అచ్చా’అనే గీతాన్ని ఆలపించారు. విడియో చివరల్లో సల్మాన్‌ రెండు చేతులు జోడించి అందరికి నమస్కారం తెలియజేస్తాడు. అనంతరం మువ్వెన్నల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 
(చదవండి : స్వాతంత్య్ర దినోత్సవం: ప్రముఖుల విషెస్‌)

కాగా, డౌన్ మొదలైన నాటి నుంచి తన పాన్వెల్ ఫార్మ్ హౌస్ దాటి రాని సల్మాన్ ఖాన్, అక్కడి నుంచే అని పనులూ చెక్కబెట్టేస్తున్న వైనం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఆయన కొన్ని పాటలను విడుదల చేసి అభిమానులను అలరించాడు. ‘ప్యార్ కరోనా’,‘తెరే బినా’పాటలతో పాటు ‘భాయ్ భాయ్’అంటూ జాతి సమైక్యతకు చిహ్నంగా నిలిచే ర్యాప్ సాంగ్‌ పాడి అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. 
(చదవండి : నేను హీరోను కాదు.. కేవలం: సోనూ సూద్‌)

గతంలో కూడా సల్మాన్ ఖాన్ పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. మై హూ హీరో తెరా, హ్యాంగోవర్ చిత్రాల కోసం పాడారు. దబంగ్3, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల్లోని జగ్ ఘూమ్ గయా, బేబీ ఖో బేస్ పసంద్ హై, యూ కుర్కే పాటలకు వాయిస్ కూడా అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా