65 మంది సింగర్స్‌.. 5 భాషల్లో స్పెషల్‌ సాంగ్‌

15 Aug, 2020 14:24 IST|Sakshi

దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ అంద‌రు త‌మ త‌మ కార్యాల‌యాల‌లో జాతీయ జెండాని ఎగుర వేసి దేశ‌భ‌క్తిని చాటుకుంటున్నారు. మరికొంత మంది సోషల్‌ మీడియా ద్వారా దేశంపై వారికి ఉన్న  ప్రేమను పంచుకుంటున్నారు. ఇక సినీ గాయకులు కూడా తమదైన శైలీలో దేశభక్తిని చాటుకున్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒకటేనని ప్రపంచానికి చాటి చెప్పారు. 
(చదవండి : సల్మాన్‌ నోట దేశభక్తి పాట.. వైరల్‌)

భారతీయు ఐకమత్యం చాటుకోవడానికి 65 మంది సింగర్స్ 5 భాషలలో దేశ భక్తి పాట పాడారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘రోజా. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’అనే పాటను 65 మంది గాయకులు పాడారు.  ‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్‌ విడుదల చేశారు.

‘టుగెదర్‌ యాజ్‌ వన్‌ ట్రాక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోంది. ఒక ముఖ్యమైన కారణం కోసం 65మంది సింగర్లు కలిసి ఈ పాట పాడటం విశేషం. ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’అని చరణ్‌ ట్వీట్‌చేశారు.

మరిన్ని వార్తలు