ట్రాన్స్‌జెండర్ల మ్యూజిక్‌ బ్యాండ్‌

4 Feb, 2021 14:40 IST|Sakshi

సంగీతానికి అవధుల్లేవు అన్నది అందరికీ తెలిసిన మాట. ​అయితే సంగీత కచేరీకీ షరతుల్లేవు అని నిరూపించింది ఓ ట్రాన్స్‌జెండర్‌ గ్రూప్‌. ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు కలిసి మ్యూజిక్‌ బ్యాండ్‌గా ఏర్పడి పాటలను వదిలారు. చెడామడా తిట్టిన నోళ్లే తమను మెచ్చుకుంటుంటే పొంగిపోయారు. ఆత్మస్థైర్యం పెంచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ సిక్స్‌ ప్యాక్‌ బ్యాండ్‌ భారత్‌లోనే తొలి ట్రాన్స్‌జెండర్ల సంగీత సమూహం కావడం విశేషం. (చదవండి: వారెంట్‌ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్‌)

ఈ బ్యాండ్‌లో ఫిదా ఖాన్‌, రవీనా జగ్‌తప్‌, ఆశ జగ్‌తప్‌, చాందిని సువర్ణకర్‌, కోమల్‌ జగ్‌తప్‌, భవికా పాటిల్‌ అనే ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు ఉంటారు. 2016లోనే ఏర్పడ్డ ఈ బ్యాండ్‌ నుంచి ఇప్పటి వరకు ఐదు పాటలు వెలువడ్డాయి. పాట రిలీజైన ప్రతిసారి అభిమానులు వాటిని విని, కొత్తగా ఉన్నాయంటూ మెచ్చుకునేవారు. సాధారణ ప్రేక్షకులే కాదు హృతిక్‌ రోషన్‌, సోనూ నిగమ్‌, అర్జున్‌ కపూర్‌, రహత్‌ ఫతే అలీ ఖాన్‌ వంటి పలువురు సెలబ్రిటీలు సైతం బ్యాండ్‌ ప్రతిభకు సపోర్ట్‌ చేస్తూ వారి పాటల వీడియోలో తళుక్కున మెరిశారు. సోనూ నిగమ్‌ అయితే వీరిని సంగీత పరిశ్రమలో గేమ్‌ ఛేంజర్‌గా పేర్కొన్నారు. (చదవండి: అరవై రోజులు ఆగకుండా షూటింగ్‌...!)

నిజంగానే సమాజంలో వివక్షకు గురవుతున్న వీళ్లు ఇక్కడివరకు రావడం అంటే మాటలు కావు. అందరి ట్రాన్స్‌జెండర్ల లాగే వీళ్లకు కూడా ఎన్నో అవమానాలు, చీత్కారాలు, వేధింపులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దాటి ముందడుగు వేశారు. సంగీత సరిగమలతో ప్రజల మనసు దోచుకునే బ్యాండ్‌గా ఎదిగారు. బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అదే సంగీతాన్ని అస్త్రంగా చేసుకుని జెండర్‌ ఈక్వాలిటీ కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. (చదవండి: సుశాంత్‌ వదిలేసుకున్న 7 బ్లాక్‌బస్టర్‌ సినిమాలు!)

మరిన్ని వార్తలు