ఇండియన్‌–2 పంచాయితీ: కొలిక్కి తేనున్న విశ్రాంత న్యాయమూర్తి

1 Jul, 2021 09:28 IST|Sakshi

కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇండియన్‌–2. ఈ చిత్ర నిర్మాణం ఆది నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. షూటింగ్‌ స్పాట్లో ట్రైన్‌ కుప్పకూలిపోవడంతో ముగ్గురు యూనిట్‌ సభ్యులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ చిత్ర షూటింగ్‌ ఇప్పటి వరకు మళ్లీ మొదలవలేదు. మధ్యలో కరోనా కష్టాలు కూడా ఇండియన్‌–2 చిత్ర నిర్మాణం జాప్యానికి ఒక కారణం.

ఇలాంటి పలు కారణాలతో దర్శకుడు శంకర్‌ వేరే చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఇండియన్‌–2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా తమ చిత్రాన్ని పూర్తి చేయకుండా శంకర్‌ వేరే చిత్రం చేయడానికి అనుమతించరాదని చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయంలో దర్శకుడు శంకర్‌ కూడా చెన్నై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌ జాప్యానికి తాను కారణం కాదని వివరించారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి నటుడు కమలహాసన్‌ మధ్యవర్తిత్వం వహించినా ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్‌–2 చిత్ర సమస్యను పరిష్కరించడానికి చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌.భానుమతి నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌.భానుమతి ఇండియన్‌–2 చిత్ర వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి వివరాలను కోర్టుకు సమర్పించిన తరువాత ఈ కేసులో తుది తీర్పును వెల్లడించను న్నట్లు చెన్నై హైకోర్టు పేర్కొంది.

చదవండి: Krithi Shetty: ఇక బిజీబిజీగా మారిపోనున్న కృతీ

క్రికెటర్‌తో ఘనంగా శంకర్‌ కూతురి వివాహం, హాజరైన సీఎం

మరిన్ని వార్తలు