IFFM: ఉత్తమ నటిగా సమంత, నటుడిగా సూర్య

20 Aug, 2021 15:40 IST|Sakshi

గ్లామర్‌తో పాటు అద్భుత నటనతో అదరగొడుతున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అక్కినేని కోడలు సమంతకు ఉత్తమ అవార్డు వరించింది.  సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం)  2021 అవార్డ్స్‌ను ప్రకటించింది. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా సమంత, ఉత్తమ నటుడుగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.


(చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు)

ఈ సిరీస్‌లో రాజీగా డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఉత్తమ చిత్రంగా సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) నిలిచింది. ఇదే సినిమాకుగాను ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యాడు. అలాగే షేర్నీ సినిమాకు గాను విద్యా బాలన్‌కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.


ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌- 2021 అవార్డుల జాబిత

  • ఉత్తమ నటుడు: సూర్య (ఆకాశం నీ హద్దురా)
  • ఉత్తమ నటి: విద్యా బాలన్‌ (షేర్నీ)
  • ఉత్తమ వెబ్‌ సిరీస్‌ నటుడు: మనోజ్‌ బాజ్‌పాయ్‌ ( ది ఫ్యామిలీమ్యాన్‌ 2)
  • ఉత్తమ వెబ్‌ సిరీస్‌ నటి: సమంత(‘ది ఫ్యామిలీమ్యాన్‌ 2’)
  • ఉత్తమ చిత్రం: ‘సూరరై పొట్రు’(ఆకాశం నీ హద్దురా)
  • ఉత్తమ డైరెక్టర్‌: అనురాగ్‌ బసు(లూడో)
  • ఉత్తమ వెబ్‌ సిరీస్‌: మీర్జాపూర్‌ 2
  • ఇక్వాలిటీ ఇన్‌ సినిమా అవార్డు :‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’
  •  డైవర్సిటీ ఆఫ్‌ సినిమా అవార్డు : పంకాజ్‌త్రిపాటి
  • ఉత్తమ డాక్యుమెంటరీ: షటప్‌ సోనా
మరిన్ని వార్తలు