ఇండియన్‌ ఐడల్‌ పాపులర్‌ కంటెస్టెంట్‌కు కరోనా

8 Apr, 2021 20:19 IST|Sakshi

ముంబై : దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. అన్ని రంగాలనూ కోవిడ్‌ కుదిపేస్తుంది. మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌కు సైతం కరోనా వ్యాపించింది. ఇది వరకే ఈ షో యాంకర్‌ ఆదిత్య నారాయణ్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోని పాపులర్‌  కంటెస్టెంట్‌ పవన్‌దీప్‌ రాజన్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని ఓ హోటల్‌ రూంలో క్వారంటైన్‌లో ఉంచారు. ఈ వారం ప్రసారం కావాల్సిన ఇండియన్‌ ఐడల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆనంద్‌ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే కరోనా కారణంగా పవన్‌దీప్‌ షోకు హాజరు కాలేదు.

దీంతో వీడియో కాల్‌ ద్వారా తనకు పాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా షో జడ్జెస్‌ని అడగ్గా..దీనికి వారు వెంటనే అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ రిలీజ్‌ చేసింది. మరి వర్చువల్‌గా పవన్‌దీప్‌ పర్మార్మెన్స్‌ ఎలా ఉందన్నది ఈవారం టెలికాస్ట్‌ అయ్యే ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంది. ఇక ఇండియన్‌ ఐడల్‌తో ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్‌ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాప్‌9లో కొనసాగుతున్నాడు. పవన్‌దీప్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ఈ షోలోని మిగతా కంటెస్టెంట్లు, యూనిట్‌ సిబ్బందికి సైతం కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే వీరి టెస్ట్‌ రిపోర్ట్‌ ఇంకా తెలియాల్సి ఉంది. 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

చదవండి : ఇండియన్‌ ఐడల్‌ : యాంకర్‌ మారడానికి కారణం అదేనా?
‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్‌


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు