ఇండియన్‌ ఐడల్‌ 12: షణ్ముక ప్రియకు విజయ్‌ సర్‌ప్రైజ్‌

15 Aug, 2021 09:25 IST|Sakshi

సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్‏ ఫైనలిస్టు తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు హీరో విజయ్‌ దేవరకొండ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇండియన్‌ ఐడల్‌ ఈ సీజన్‌లో ఆమె పైనలిస్ట్‌ జాబితాలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం (అగష్టు 15) ఈ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ 12 గంటల పాటు ప్రసారం కానుంది. ఫైనల్‌లో షణ్ముక ప్రియ మిగతా టాప్‌ 5 కంటెస్టెంట్స్‌తో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎపిసోడ్‌లో విజయ్‌ వీడియో ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఫేవరేట్‌ హీరో తనకు విషెస్‌ చెప్పడంతో షణ్ముక ఆనందంతో మురిసిపోయింది.   

షణ్ముక ఇండియ‌న్ ఐడ‌ల్ స్టేజ్‌పై ఉండ‌గానే వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌కరించిన విజయ్‌ నీకు నా లవ్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని అన్నాడు. గెలుపు ఓటములు గురించి పట్టించకోవద్దని,  నీ టాలెంట్‌ను పరిచయం చేస్తూ.. ఫైనల్‌ పోటీని ఎంజాయ్ చేయి అంటూ ధైర్యం ఇచ్చాడు. నీ జీవితానికి సరిపడే అనుభూతిని సొంతం చేసుకోమంటూ షణ్ముకకు విషెస్‌ తెలిపాడు. అలాగే ఈ ఫోటీలో పాల్గొంటున్న ప్రతీ కంటెస్టెంట్‌, వారి పేరెంట్స్‌కు, జడ్జీలకు కూడా విజయ్‌ ఆల్‌ ది బెసట్‌ తెలిపాడు. కాగా విజయ్ దేవరకొండకు తను పెద్ద ఫ్యాన్ అనీ, ఆయన సినిమాలో పాడటమే తన కోరిక అని గతంలో షణ్ముక షో నిర్వాహకులకు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఇక సోనీ టీవీ నిర్వాహకులు విజయ్‏ను సంప్రదించి షణ్ముకకు విషెస్ తెలపాలని కోరడంతో విజయ్‌ ఇలా ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు