కనిపించని ఆదిత్య నారాయణ్‌.. నేహా కక్కర్‌ ఏమందంటే..

5 Apr, 2021 17:02 IST|Sakshi

ముంబై : ఇండియన్‌ ఐడల్‌ రియాలిటీ షో దేశ వ్యాప్తుంగా ఎంతో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 నిర్విరామంగా కొనసాగుతుంది.  నిన్నటి షోలో ముఖ్య అతిధిగా బాలీవుడ్‌ అందాల తార రేఖ వచ్చారు. తన ఎనర్జీతో షో ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేశారు. అయితే ఈ షోకు మొదటి నుంచి ఆదిత్య నారాయణ్‌ యాంకర్‌గా ఉన్నారు. అలాంటిది సడెన్‌గా ఆదిత్య నారాయణ్‌ స్థానంలో జయ్‌ భానుశాలి కనిపించారు. దీంతో అసలు ఆదిత్య నారాయణ్‌ను ఏమైంది? సడెన్‌గా హోస్ట్‌ను ఎందుకు మార్చారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆదిత్యను ఎవరూ రీప్లేస్‌ చేయడం లేదని, కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఆయన స్థానంలో జయ్‌ భానుశాలి ఉంటారని తెలుస్తుంది. ఈ మార్పులన్నింటికీ కారణం కరోనా వైరస్ అని తేలింది‌. ప్రస్తుతం మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా యాంకర్‌ ఆదిత్య నారాయన్‌కు సైతం కరోనా సోకింది. దీంతో తాత్కాలికంగా ఈ షో నుంచి తప్పుకున్నారు.


ఆదిత్య నారాయణ్‌తో పాటు ఆయన భార్య  శ్వేతా అగర్వాల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలిందని స్వయంగా ఆదిత్య నారయణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు..ప్రస్తుతం కరోనా కారణంగా  హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ కొత్త దంపతుతు త్వరగా కోలుకోవాలని  కోరుతూ పలువురు నెటిజన్లు సహా ప్రముఖ సింగర్‌, ఇండియన్‌ ఐడల్‌ జడ్జిలో ఒకరైన నేహా కక్కర్ సైతం కామెంట్‌ చేశారు. 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్‌
భార్యను ఏడిపించిన సింగర్‌


 

మరిన్ని వార్తలు