Indrani Movie: ఇండియా తొలి సూపర్‌ గర్ల్‌గా 'ఇంద్రాణి'.. మేకింగ్ వీడియో రిలీజ్‌

22 Apr, 2022 17:39 IST|Sakshi

Indrani First Telugu Super Girl Movie Making Video Released: యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల డెడికేషన్‌, రిస్క్‌ చూసి ఆశ్చర్యపోయానని డైరెక్టర్‌ స్టీఫెన్‌ తెలిపారు. ఇండియాలోనే మొట్టమొదటి సూపర్‌ గర్ల్‌ మూవీ 'ఇంద్రాణి' షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భారీ వీఎఫ్‌ఎక్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో స్టీఫెన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యానియా భరద్వాజ్‌, కబీర్‌ దుహాన్ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు స్టాన్లీ సుమన్‌ బాబు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను రిలీజ్ చేశారు. రెండేళ్లకుపైగా జరిపిన ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్‌తో వీఎఫ్‌ఎక్స్‌ ప్లానింగ్‌ ఈ సినిమాను మరింత వేగంగా చిత్రీకరించేలా ఉపయోగపడుతున్నాయని డైరెక్టర్‌ తెలిపారు. భారతీయ చరిత్రలోనే మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్ షాట్స్, కత్తులు ఉపయోగించి విన్యాసాలు చేసిన తొలి చిత్రం 'ఇంద్రాణి' అని పేర్కొన్నారు. ఈ మూవీ మొదటి మహిళా యాంటీ గ్రావిటీ, జీరో గ్రావిటీ సినిమా అని మేకర్స్‌ వెల్లడించారు. 

చదవండి: ఆగని 'ఆర్ఆర్ఆర్‌' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ?


మరిన్ని వార్తలు