దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్‌!

3 Nov, 2020 11:40 IST|Sakshi

సెలబ్రిటీలకు తమ వృత్తితోపాటు సోషల్‌ మీడియా కూడా ముఖ్యమే.. తమను ఆరాధించే అభిమనులకు చేరువుగా ఉండేందుకు సోషల్‌ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుంది. తమకు చెందిన వృత్తి, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌‌లలో వీరికి లక్షల్లో ఫాలోవర్స్‌ ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్‌ సెలబ్రిటీలలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల వరకు నాలుగో స్థానంలో ఉన్న ఈ సాహో భామ మరో నటి దీపికా పదుకొనెను వెనక్కునెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. చదవండి: నాగకన్యగా.. శ్రద్ధా కపూర్

ఫోటోలు, వీడియోలు షేరే చేసే ఈ సోషల్‌ మీడియా యాప్‌ను ఇండియాలో కొన్ని మిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. వినోదం, సామాజిక, ఇతరాత్ర కంటెంట్‌తో తమ సంబంధాలను మెరుగు పురుచుకుంటున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ వ్యక్తి క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఇతనిని 82.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక విరాట్ తరువాత 58.1 మిలియన్ల అభిమానులతో ప్రియాంక చోప్రా జోనాస్ రెండో స్థానంలో​ఉన్నారు. ఇప్పటి వరకు దీపికా పదుకొనె 52.3 మిలియన్లతో మూడో స్థానంలో ఉంటే తాజాదా శ్రద్ధా కపూర్ ఆమెను దాటుకొని  56.4 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: దీపికా మేనేజర్‌కు మరోసారి ఎన్‌సీబీ సమన్లు

వీరితో పాటు మిగతా బాలీవుడ్ ప్రముఖులు 50.1 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో అలియా భట్, 48.2 మిలియన్లతో నేహా కక్కర్, అక్షయ్ కుమార్ 46.8, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 46.2 మిలియన్, కత్రినా కైఫ్ 44.8 మిలియన్ల అభిమానులను కలిగి ఉన్నారు. బాలీవుడ్ నటులు, ప్రముఖులే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రపంచ వ్యాప్తంగా 49.7 మిలియన్ల మంది ఫాలో అవుతన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా