Nushrat Bharucha Unknown Facts: హఠాత్తుగా వీగన్‌గా మారిపోయా.. కొత్తలో చాలా కష్టంగా ఉండేది: నుస్రత్‌

31 Jul, 2022 09:13 IST|Sakshi

భాషా భేదం లేకుండా  అలరించిన హిందీ చిత్రం ‘ప్యార్‌ కా పంచ్‌నామా’. ఆ మూవీతో  సినీ అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన నటి ‘నుస్రత్‌ భరూచా’. ఈ కథానాయిక తెలుగు ప్రేక్షకులకూ పరిచితమే 2010లో వచ్చిన ‘తాజ్‌ మహల్‌’ సినిమా ద్వారా! వెండితెర కంటే ముందు చిన్నతెర.. ఇప్పుడు వెబ్‌స్క్రీన్‌ మీదా కనిపిస్తూ నిత్యం లైమ్‌లైట్‌లో మెరిసిపోతోంది నుస్రత్‌. 

పుట్టింది, పెరిగింది ముంబైలో. తండ్రి తన్వీర్‌ భరూచా, బిజినెస్‌మన్‌. తల్లి తస్నీమ్‌ భరూచా.. గృహిణి. 

► డిగ్రీ చదివే రోజుల నుంచే నాటకాల్లో నటించేది. ఆ సమయంలోనే ‘కిట్టీ పార్టీ’ అనే టెలివిజన్‌ షోను నిర్వహించే చాన్స్‌ వచ్చింది నుస్రత్‌కు. ఆ షో ఆమెకు మంచిపేరే తెచ్చిపెట్టింది ఆ వాతావరణం నచ్చక మధ్యలోనే ‘కిట్టీ పార్టీ’కి గుడ్‌ బై చెప్పేసింది. 

► ఆ తర్వాత ‘జై సంతోషిమా’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. పెద్దగా పేరు రాలేదు. 2010లో ‘తాజ్‌ మహల్‌’ చిత్రంతో తెలుగు వారికీ పరిచయం అయింది. 

► నుస్రత్‌కు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ప్యార్‌ కా పంచ్‌నామా. దాని సీక్వెల్లోనూ నటించే చాన్స్‌ దొరికింది. అదీ ఆమె పాపులారిటీని పెంచింది. అనంతరం వచ్చిన సోనూ కే టీటూ కీ స్వీటీ.. గురించి చెప్పక్కర్లేదు. నుస్రత్‌కు ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు వంటి హీరోల సరసన అభినయించే అవకాశాలను ఇచ్చింది. 

► ఓ వైపు థియేటర్‌ ఆర్టిస్ట్, ఇంకో వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మ్యూజిక్‌ వీడియోల్లోనూ కనిపించింది. 

► వెబ్‌ స్క్రీన్‌కు పెరుగుతున్న ఆదరణను గ్రహించి.. ‘అజీబ్‌ దాస్తా’అనే ఆంథాలజీలో నటించింది. నటిస్తోంది కూడా. 

ఫుడ్‌ అంటే ఓ సెలెబ్రేషన్‌లా భావించే కుటుంబం మాది. నాన్‌ వెజ్‌ అంటే చెప్పక్కర్లేదు. అలాంటిది హఠాత్తుగా వీగన్‌గా మారిపోయా. కొత్తలో చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అలావాటైపోయింది. నా విల్‌ పవర్‌ అర్థమైంది. యాక్టింగ్‌ అనేది మంచి కెరీర్‌ కాదని మా బంధువుల అపోహ. అందుకే నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో యాక్టింగ్‌ అనేది పార్ట్‌ టైమ్‌ అని చెప్పేదాన్ని!
– నుస్రత్‌ భరూచా 

మరిన్ని వార్తలు