కన్నడ బ్యూటీ కాజోల్‌ చుఘ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

22 Aug, 2021 09:47 IST|Sakshi

కాజోల్‌ చుఘ్‌.. సిరీసా? సినిమానా? అని చూసుకోదు.. పోషించిన పాత్ర చిన్నదా? నిడివి గలదా? అనీ బేరీజు వేసుకోదు. తనకు ఇచ్చిన రోల్‌లో ఇమిడిపోతున్నానా.. లేదా అని మాత్రమే చెక్‌ చేసుకుంటుంది మానిటర్‌ మీద. అందుకే వెబ్‌ వీక్షకులు ఆమెకు వీరాభిమానులు.  

బెంగళూరులో పుట్టి, పెరిగింది. చిన్నప్పుడే యాక్టర్‌ కావాలని ఫిక్స్‌ అయిపోయింది. అందుకే థియేటర్‌ స్టడీస్‌లో బీఏ చదివింది. 

 కాలేజీ రోజుల్లోనే పలు స్టేజ్‌ షోస్‌ చేసి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

రంగస్థలం నుంచి సినిమా అనే పెద్ద రంగుల ప్రపంచంలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు ముంబై చేరింది. 

తొలుత వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. తర్వాత యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసింది. 

 ‘మసాబా మసాబా’ తో వెబ్‌ స్ట్రీమ్‌లోకి అడుగుపెట్టింది. ‘బాంబే బేగమ్స్‌’, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారంలో ఉన్న  ‘ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌’లో  ముఖ్య భూమికలను పోషించింది. 

ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తీసిన ‘షకీలా’ సినిమాలో టీన్స్‌లో ఉన్న షకీలా పాత్రను ధరించింది. ‘లైఫ్‌ ఆఫ్‌ పకోడి’ అనే తెలుగు సినిమాలోనూ నటించింది. 

‘కన్న కలల వెంట మనం పరుగులు పెడితే, అవే మనకు దారిని చూపిస్తాయి.  చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కలలు కనేదాన్ని. ఇప్పుడు నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.  – కాజోల్‌ చుఘ్‌

మరిన్ని వార్తలు