స్మాల్‌ స్క్రీన్‌ ‘మిరాకిల్‌’ పల్లవి ముఖర్జీ

26 Sep, 2021 10:24 IST|Sakshi

మొదట హీరోయిన్‌గా చేసి, వయసు పైబడ్డాక తల్లి పాత్రలు వేయడం పాత పద్ధతి. దానికి రివర్స్‌గా  తల్లి పాత్రతో మొదలుపెట్టి తర్వాత హీరోయిన్‌గా రాణించడం తన స్టయిల్‌గా మార్చుకుంది పల్లవి ముఖర్జీ. వరుస సీరియల్స్, సిరీస్‌తో వీక్షకులను  అలరిస్తున్న ఆ స్మాల్‌ స్క్రీన్‌ మిరాకిల్‌ గురించి.. 

పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కోల్‌కతాలోనే. అక్కడే జోగమాయా దేవి కాలేజ్‌లో బీఏ సైకాలజీ కోర్సు పూర్తి చేసింది. 

డాన్స్‌ అంటే చాలా ఇష్టం. కొంతకాలం గుడియా నృత్యం(బెంగాలీ జానపద నృత్యం)లో శిక్షణ కూడా తీసుకుంది. 

 చిన్నప్పటి నుంచి హీరోయిన్‌ కావాలనుకున్న పల్లవి, కమేడియన్‌గా కెరీర్‌ ప్రారంభించింది. 

2014లో ‘మిరాకిల్‌’ అనే బెంగాలీ స్టాండప్‌ కామెడీ షోలో పాల్గొని బుల్లితెరకు పరిచయమైంది. తర్వాత ‘ఆరెంజ్‌ ఇష్క్‌’ షోతో యాంకర్‌గా మారింది. 

ఒకవైపు చిన్న చిన్న షోలు, మోడలింగ్‌ చేస్తూనే, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేది. 

2015లో ‘మీరా’ అనే బెంగాలీ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేసే అవకాశం దక్కింది. అలా సినిమా హీరోయిన్‌ కాకపోయినా  సీరియల్‌ హీరోయిన్‌ అయింది. 

ఆమె అద్భుతమైన నటనకు అవకాశాలవెల్లువ మొదలైంది. వరుసగా ‘భూతూ’, ‘బారిస్టర్‌ బాబు’ సీరియల్స్‌ చేసింది. 

‘గందీ బాత్‌ 3’, ‘ క్లాస్‌ ఆఫ్‌ 2020’ సిరీస్‌తో వెబ్‌ దునియాలోకీ అడుగుపెట్టి తన పరిచయాన్ని విస్తృతం చేసుకుంది.

బారిస్టర్‌ బాబు’ సీరియల్‌లో అరవై ఏళ్ల ముసలాయనకు భార్యగా, అతని పిల్లలకు తల్లిగా నటించా. కెరీర్‌ ప్రారంభంలోనే మదర్‌ రోల్స్‌ చేస్తే ఎన్నటికీ  హీరోయిన్‌ కాలేవన్నారు. కానీ, టాలెంట్‌ ఉంటే అవేవీ మనల్ని ఆపలేవు. నేను ఎప్పటికైనా సినిమా హీరోయిన్‌ అవుతా – పల్లవి ముఖర్జీ

మరిన్ని వార్తలు