Simran Jehani: కథ, దర్శకత్వం, నటన.. ఆమె సొంతం

8 Aug, 2021 09:53 IST|Sakshi

సిమ్రన్‌ జెహనీ..  చేసిన సినిమాలు కొన్నే అయినా మంచి కథాంశాలు, చక్కటి పాత్రలతో రచయితగా, దర్శకురాలిగా, నటిగా విమర్శకుల, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇప్పుడు ఇక్కడ ఆమె పరిచయానికి కారణం.. నెట్‌ఫ్లిక్స్‌లోని తాజా ఆంథాలజీ ‘ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌’లోని ఆమె నటనే.  

ముంబైలో పుట్టి,పెరిగింది. యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌  కాలిఫోర్నియాలో మాస్‌ మీడియా కోర్స్‌ పూర్తి చేసింది.

అక్కడే అమెజాన్‌ స్టూడియోస్‌లో కొంతకాలం పనిచేసింది.

ఫ్యాషన్‌ మీదున్న ప్యాషన్‌తో మోడలింగ్‌ వైపు మనసు మళ్లించింది. పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది.

మోడల్‌గా వచ్చిన గుర్తింపు సినిమా అవకాశాలనూ తెచ్చింది. 

2011లో ‘కచ్చా లింబూ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఖూబ్‌సూరత్‌’ వంటి సినిమాల్లోనూ నటించింది.  

2010లో ’ద సమ్మర్‌’ సినిమా కథను రచించి దర్శకత్వం వహించింది. ’లిటిల్‌ ఇష్యూస్‌’ సినిమాను కూడా డైరెక్ట్‌ చేసి ఫిల్మ్‌ మేకర్‌ టైటిల్‌నూ ఖాయం చేసుకుంది.
   
వెబ్‌ సిరీస్‌లో నటించి ఓ కొత్త అనుభూతి పొందాను. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. పైగా నేర్చుకోవడానికీ చాలా స్కోప్‌ ఉంటోంది. – సిమ్రన్‌ జెహనీ

మరిన్ని వార్తలు