మిస్‌ శెట్టి... మిస్టర్‌ పొలిశెట్టి?

27 Mar, 2021 08:16 IST|Sakshi

నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయి ప్రేమలో పడతారు. వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలియడానికి చాలా సమయం ఉంది. నవీన్‌ పొలిశెట్టి, అనుష్కా శెట్టి ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నవీన్, అనుష్క ఒరిజినల్‌ పేర్లనే ఇలా చమత్కరించి టైటిల్‌గా పెట్టడం బాగుందని అంటున్నారు నెటిజన్లు. మరి.. ఈ టైటిలే ఖరారవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని వార్తలు