ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశాను

13 Feb, 2024 00:03 IST|Sakshi

డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ 

‘‘సూపర్‌ నేచురల్‌ ఫ్యాంటసీ జోనర్‌లో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా రూపొందింది. మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులు ఆత్మ తాలూకు ప్రయాణం ఎలా ఉంటుందన్నది గరుడ పురాణంలో చదివాను. ఆ స్ఫూర్తితో ఈ చిత్రకథ రాశాను. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్‌ చేస్తారు’’ అని డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ అన్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమా ఈ 16న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్‌ పంచుకున్న విశేషాలు.
 
► సందీప్‌ కిషన్‌కి రెండు ఐడియాలు చెబితే  ‘ఊరు పేరు భైరవకోన’ కథకు ఎగ్జయిట్‌ అయ్యాడు. నాకు కూడా ఈ కథ చేస్తే చాలా కొత్తగా ఉంటుంది, ఒక ట్రెండ్‌ సెట్‌ చేసేలా ఉంటుందని ఫిక్స్‌ అయ్యాం. రాజేశ్‌ దండా ఈ కథ వినగానే ఎగ్జయిట్‌ అయ్యారు. సందీప్, నా మంచి కోరే అనిల్‌ సుంకరగారు కూడా ఈప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ సినిమాప్రారంభమైంది. బిగ్‌ స్క్రీన్‌పై విజువల్, సౌండ్‌ పరంగా ఆడియన్స్‌కి గొప్ప అనుభవాన్ని ఇచ్చే సినిమా ఇది.

► ఈ చిత్రకథలో కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివదండం.. వంటి నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి ‘ఊరు పేరు భైరవకోన’ యాప్ట్‌ అనిపించి ఆ టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. ‘టైగర్‌’ టైమ్‌లో ఉన్న ఫైర్, ప్యాషన్‌ సందీప్‌లో ఇప్పుడూ ఉన్నాయి. ప్రతి సినిమాని తొలి సినిమాలానే చేస్తున్నాడు. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌తో వస్తున్న సినిమా ఇది.

► నేను గతంలో అల్లు అర్జున్‌తో ఓ సినిమాతో పాటు, గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హీరో నిఖిల్‌తో ఓ సినిమా చర్చల్లో ఉంది. అలాగే ఓ పెద్ద హీరోకి యాక్షన్‌ కథ రాస్తున్నాను. 

whatsapp channel

మరిన్ని వార్తలు