స్క్రీన్‌ ప్లేలో... ప్రయోగాత్మక సినిమా

5 Mar, 2021 06:14 IST|Sakshi
హరి ప్రసాద్‌ జక్కా

దినేష్‌ తేజ్, అనన్య హీరో హీరోయిన్లుగా హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్లే బ్యాక్‌’. ప్రసాదరావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. హరిప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో 2019లో ఉన్న ఓ వ్యక్తి, 1993లో ఉన్న మరో వ్యక్తితో ఫోన్‌ లో మాట్లాడుతుంటాడు. ఇది క్రాస్‌ టైమ్‌ కనెక్షన్‌  మూవీ. ఈ కాన్సెప్ట్‌ మీద కూడా కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ మా సినిమా కథ వేరు. సినిమాలోని క్యారెక్టర్స్‌కు మాత్రమే కాదు... కనిపించే సినిమా పోస్టర్, చెట్టు, ఫోను వంటి వాటికి కూడా సినిమాలో కనెక్షన్‌  ఉంటుంది. ఇందులో ఒక్క పాట కూడా లేదు. ఈ సినిమా కథ పరంగా ప్రయోగాత్మకం కాదు కానీ స్క్రీన్‌ ప్లే పరంగా మాత్రం ప్రయోగాత్మక సినిమా’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు