Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో కన్నీటి ధారలు

2 Jul, 2021 13:32 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 361వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

Intinti Gruhalakshmi Juny 2వ ఎపిసోడ్‌: తండ్రిగా, భర్తగా, కొడుకుగా అన్ని రకాలుగా మీరు ఓడిపోయారని నందును విమర్శించింది తులసి. జీవితంలో ఓడిపోతే అండగా నిలబడేదాన్ని కానీ విలువల్లో ఓడిపోయారని అసహ్యించుకుంది. దీంతో ఆమెకు నచ్చజెప్పాలని చూసిన నందును మధ్యలోనే ఆపేసింది తులసి. ఇన్నాళ్లూ మీరు చెప్పింది, నేను విన్నది చాలని తేల్చి చెప్పింది. దీంతో ఇదే సరైన సమయమనుకున్న లాస్య వీళ్లను శాశ్వతంగా విడగొట్టాలని భావించింది. 

నీకు విలువ లేని చోట ఉండాల్సిన అవసరం లేదని, మనం వెళ్లిపోదామంటూ నందు చేయి పట్టుకుని లాగింది. అందరి దగ్గర అవమానాలు పడే దుస్థితి మనకక్కర్లేదని చెప్పింది. నందు అప్పటికీ ఏం చేయాలో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో శిలావిగ్రహంలా నిల్చుండిపోతే ఆమె అతడిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయింది. తన భార్య, కుటుంబం నుంచి నందును దూరం చేసింది.

నందుకు మానసికంగా విడాకులిచ్చేసిన తులసి భర్త లేకపోయినా తనను ప్రేమించే కుటుంబం ఉందని పైకి ధైర్యాన్ని నటించింది. మీ కొడుకులా మధ్యలో వదిలేసి పోనని, అలా వదలడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకే అని నందు తండ్రితో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నందు కూడా జరిగినదాన్ని తలుచుకుంటూ తెగ బాధపడ్డాడు. విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నా తులసి తనతో తెగదింపులు చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో తనకు తెలియకుండానే అతడిలో అంతర్మథనం మొదలైంది. తను ఎంచుకున్న రూటు సరైనదేనా? అని పరిపరివిధాలా ఆలోచిస్తున్నాడు. నందు కట్టుకున్న భార్య కోసం తపిస్తాడా? లేదా మధ్యలో వచ్చిన లాస్య చేయి పట్టుకుని నడుస్తాడా?అతడిప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడి తనయుడు

మరిన్ని వార్తలు