అంకిత సూసైడ్‌ ప్లాన్‌! దారుణంగా మోసపోతున్న అభి

18 Jun, 2021 13:02 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 349వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

ఇంటింటి గృహలక్ష్మి జూన్‌ 18వ ఎపిసోడ్‌: ఇంటిల్లిపాది తనను చేతకానివాడిలా చూడటం తట్టుకోలేకపోయాడు నందు పెద్దకొడుకు అభి. దీంతో అత్తింటి నుంచి పెట్టేబేడా సర్దుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అంకిత అతడిని ఆపే ప్రయత్నం చేసింది కానీ అభి వినిపించుకోలేదు. ఈ గడప దాటి వెళ్తే మళ్లీ ఇంట్లో అడుగు పెట్టలేవు అని అంకిత తండ్రి హెచ్చరించినా అతడు వెళ్లిపోవడానికే రెడీ అయ్యాడు. నేల మీదకు రావాల్సిన పసిపాపను కడుపులో చంపేశారు, దీన్ని హత్య కాకపోతే ఇంకేం అంటారు. ఇలాంటి మనుషుల మధ్య నేనుండలేను అంటూ అక్కడివారికి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయాడు.

తిరిగి తన ఇంటికి వెళ్లిన అభి తల్లి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు. ఈ ఇంటిని వదిలి వెళ్లాకే మీ అందర ప్రేమకు దూరమయ్యానని తెలిసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ అంకితను వదిలేసి వచ్చానని చెప్పగానే తులసి లాగి కొట్టింది. మీ నాన్నను చూసి నేర్చుకుంటున్నావా? అని మండిపడింది.

ఇంతలో అంకిత తల్లి ఫోన్‌ చేసి తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పింది. కాకపోతే సకాలంలో చూశాం కాబట్టి తను ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. దీంతో ఊపిరి పీల్చుకున్న అభి వెంటనే వస్తున్నానని చెప్పాడు. అయితే అంకితను వెంట తీసుకుని రమ్మని తులసి అభికి సూచించింది. మీ మధ్య దూరాలు పెంచే చోట ఉండకూడదని స్పష్టం చేసింది.

దీంతో ఎలాగైనా అంకితను అక్కడి నుంచి తీసుకొచ్చేయాలన్న ధృడ సంకల్పంతో అభి ఆ ఇంటికి వెళ్లాడు. అప్పుడు బిడ్డను చంపి ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా? అని నిలదీశాడు. ఇక్కడ మనం ఉండకూడదని, తనతో వచ్చేయమని అంకితను కోరాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు కుదరదని చెప్పారు.

కేవలం తన భార్య అభిప్రాయం మాత్రమే అడుగుతున్నానని అభి చెప్పడంతో అంకిత ఆలోచనలో పడింది. అభిని తిరిగి రప్పించాలనుకుని సూసైడ్‌ ప్లాన్‌ వేస్తే ఇలా అయ్యిందేటని అంకిత తల్లి పరిపరివిధాలా ఆలోచించింది. ఇంతలో అంకిత అభి వెంట వెళ్తానని, అక్కడివాళ్లకు, అతడికి మధ్య దూరాన్ని పెంచి ఆ ఇంటి నుంచి శాశ్వతంగా తిరిగొచ్చేలా చేస్తానని చెప్పింది. దీంతో తులసి ఇంట్లో మళ్లీ కలహాలు మొదలయ్యేటట్లు కనిపిస్తోంది.

చదవండి: కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు