దసరా కానుకగా వస్తున్న ‘ఐక్యూ'

20 Aug, 2022 15:27 IST|Sakshi

సాయిచరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్‌ జీఎల్‌బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్న ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం నటుడు సత్యప్రకాశ్‌గారిపై ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నాం. ఈ 25తో షూటింగ్‌ పూర్తవుతుంది’’ అన్నారు జీఎల్‌బీ శ్రీనివాస్‌.

‘‘ఈ చిత్రంలో మా అన్న కొడుకు సాయిచరణ్‌ హీరోగా నటిస్తున్నాడు’’ అన్నారు కాయగూరల లక్ష్మీపతి. ‘‘మా తొలి చిత్రం ‘ఐక్యూ’ని ఆదరించి, మరిన్ని సినిమాలు చేయడానికి మాకు ఎనర్జీ ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అన్నారు సాయిచరణ్‌. సుమన్, సత్యప్రకాశ్, పల్లవి మాట్లాడారు. ఈ చిత్రానికి కథ–మాటలు–సంగీతం: పోలూర్‌ ఘటికాచలం, కెమెరా: టి. సురేందర్‌రెడ్డి. 

మరిన్ని వార్తలు