సినిమాల్లో నటించడానికి మొదట్లో భయం వేసింది: సాయిచరణ్‌

22 Jun, 2022 07:39 IST|Sakshi
ట్య్రాన్సీ, సాయిచరణ్, పల్లవి

సాయిచరణ్, పల్లవి, ట్య్రాన్సీ ముఖ్య తారలుగా శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి సమర్పణలో బొమ్మదేవర రామచంద్రరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత కేఎస్‌ రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఒకప్పుడు సినిమాలకు టెలివిజన్‌ ఒక్కటే విరోధి. ఇప్పుడు ఓటీటీ కూడా. కరోనా తర్వాత కొత్త సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఆచితూచి అడుగులు వేయాలి. మంచి సబ్జెక్ట్‌తో వస్తోన్న ‘ఐక్యూ’ పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు కేఎస్‌ రామారావు.

‘యూత్‌పుల్‌ కంటెంట్‌తో వస్తోన్న ‘ఐక్యూ’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు గంటా శ్రీనివాసరావు. ‘‘నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడంతో సినిమాల్లో నటించడానికి మొదట్లో భయం వేసింది. కానీ నటనపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు సాయిచరణ్‌. ‘‘యూనిక్‌ సబ్జెక్ట్‌తో చేస్తోన్న మూవీ ‘ఐక్యూ’. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రం’’ అన్నారు దర్శక–నిర్మాత జీఎల్‌బీ శ్రీనివాస్‌.     

మరిన్ని వార్తలు