ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన ఇరా ఖాన్‌

17 Oct, 2020 09:47 IST|Sakshi

ముంబై : తన మీద వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఇరా ఖాన్‌ స్పందించారు. ఇటీవల ఇరా తన మానసిక ఆరోగ్యం గురించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. గత నాలుగేళ్లుగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఈ వీడియోలో వెల్లడించారు. అయితే ఇరా చేసిన ఈ పోస్టుపై కొంతమంది ట్రోల్స్‌ చేస్తున్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. దీనిపై ఇరా స్పందిస్తూ ట్రోల్స్‌కు ఘాటుగా బదులిచ్చారు. తన పోస్టుపై ఎవరైన అభ్యంతరకంగా కామెంట్‌ పెడితే తొలగిస్తానని, అదే వ్యక్తి మళ్లీ మళ్లీ అలాగే పెట్టడానికి ధైర్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’

ఇక ఇరా ఖాన్‌.. ఆమిర్‌ ఖాన్‌ మొదటి భార్య రీనా దత్తాల కూతురు అన్న విషయం తెలిసిందే. తను(ఇరా) గత నాలుగేళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అక్టోబర్‌ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. మానసిక ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తెలీదు. అందుకే తన జర్నీ గురించి చెప్పాలి అనుకుటుంన్నానని, అస‌లు తనెందుకు ఒత్తిడికి లోనయ్యింది? ఏంటి అనే విష‌యాల‌ను తెలియజేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దానివ‌ల్ల మీకు మాన‌సిక ఆరోగ్యంపై కాస్తైనా అవ‌గాహ‌న వ‌స్తుందేమో" అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లు డిప్రెష‌న్‌లో ఉన్నా: హీరో కూతురు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు