పెళ్లి పేరుతో సహజీవనం..నటి భర్తపై విదేశీ మహిళ ఫిర్యాదు

12 Feb, 2023 21:09 IST|Sakshi

రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భర్త మోసం చేశాడంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాఖీ సావంత్. తాజాగా ఆదిల్‌పై మరో మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఇరాన్ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పెళ్లికి నిరాకరించాడని.. అలాగే చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది. 

ఇరాన్ మహిళ ఫిర్యాదుతో రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీపై మైసూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్  నమోదు చేశారు. మైసూర్‌లో సహజీవనం చేసేటప్పుడు పెళ్లి పేరుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని ఇరాన్ మహిళ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రాఖీ సావంత్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు ఆదిల్.

ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా.. బెదిరించాడని ఇరానీ మహిళ పోలీసులకు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని పేర్కొంది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేస్తానని చెప్పాడని వాపోయింది. ఈ వార్త విన్న రాఖీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదిల్‌పై రాఖీ ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిల్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని రాఖీ కంప్లెంట్‌లో పేర్కొంది. ఆదిల్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

మరిన్ని వార్తలు