తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి!

8 Mar, 2021 01:24 IST|Sakshi

క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ నటిస్తున్న తొలి సినిమా ‘కోబ్రా’. విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ‘కోబ్రా’ సినిమాలోని ఓ కీలక షెడ్యూల్‌ కోసం ఇర్ఫాన్‌ రష్యా వెళ్లి వచ్చారు. ఈ షెడ్యూల్‌ గురించి ఇర్ఫాన్‌ మాట్లాడుతూ– ‘‘మైనస్‌ 20 డిగ్రీల చలిలో వర్క్‌ చేయడం నాకు కొత్తగా అనిపించింది. ఓ సందర్భంలో నా హెడ్‌క్రాఫ్‌ తీశాను. అంతే.. వెంటనే నా చెవులు ఎర్రగా మారిపోయాయి. చలితో వణికిపోయాను. కశ్మీర్‌ వాతావరణం నాకు తెలుసు.

కానీ రష్యాలో వాతావరణం ఎలా ఉంటుందనేది ‘కోబ్రా’ సినిమా వల్ల నాకు తెలిసింది. నాతో పాటు మా ఫ్యామిలీ కూడా రష్యా వచ్చారు. షూటింగ్‌ లేని సమయంలో ఆ లొకేషన్స్‌ను బాగా ఆస్వాదించాం. నాకు తెలుగు, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా యాక్టర్‌గా ఆఫర్లు వచ్చాయి. కానీ ‘కోబ్రా’ సినిమా విడుదలయిన తర్వాత నా నటనకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసి, నా క్రికెట్‌ కమిట్‌మెంట్స్‌ లేకపోతే అప్పుడు కొత్త సినిమాలు కమిట్‌ అవుదామని అనుకుంటున్నాను’’ అన్నారు ఇర్ఫాన్‌ పఠాన్‌.

మరిన్ని వార్తలు