‘ఐరన్‌మ్యాన్‌’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్‌మ్యాన్‌’ అలా..

5 Jul, 2021 10:45 IST|Sakshi

ఐరన్‌మ్యాన్‌.. మార్వెల్‌ కామిక్స్‌లో పిల్లలకు ఓ ఫేవరెట్‌ క్యారెక్టర్‌. అలాంటి క్యారెక్టర్‌కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్ని​సంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్‌ డానీ జూనియర్‌. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.

రాబర్డ్‌ డానీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి కొందరిని అన్‌ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్‌ నటులను అన్‌ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్‌ అమెరికా’ క్రిస్‌ ఎవాన్స్‌, స్పైడర్‌ మ్యాన్‌ ‘టామ్‌ హాలాండ్‌’  లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్‌ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్‌కు డానీ గుడ్‌బై చెప్పాడా? ఇక ఐరన్‌ మ్యాన్‌గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా.

 

అయితే డానీ తన ఇన్‌స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్‌ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్‌లో.. ఏ ఒక్క యాక్టర్‌ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్‌లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్‌ జాన్‌ డానీ జూనియర్‌.

ముద్దులతో స్పైడర్‌మ్యాన్‌
టామ్‌దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్‌ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్‌మ్యాన్‌ ఫేమ్‌ టామ్‌ హోలాండ్‌(25).. తన కో స్టార్‌ జెన్‌దయాతో రిలేషన్‌లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు.

కాగా, ఈ బ్రిటిష్‌ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్‌ నటి జెన్‌దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్‌మ్యాన్‌ హోంకమింగ్‌(2017) నుంచి పీటర్‌ పార్కర్‌-ఎంజే క్యారెక్టర్‌ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు