బాలీవుడ్‌లో మరో వారసుడొస్తున్నాడు..

11 Apr, 2021 08:33 IST|Sakshi

బాలీవుడ్‌లో వారసుల జాబితా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ లిస్ట్‌లో బాబిల్‌ ఖాన్‌ పేరు చేరింది. దివంగత ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ వారసుడే ఈ బాబిల్‌. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్కా శర్మ ప్రొడక్షన్‌ హౌస్‌ క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఓ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీలో బాబిల్‌ హీరోగా చేస్తున్నారు.

ఈ సినిమాకు ‘కాలా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. అన్విత దత్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో డిమ్రీ త్రిపాఠి హీరోయిన్‌. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు కరోనా

ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు